Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎక్సైజ్ స్టేషన్‌లో రేపు స్వాధీన వాహనాల వేలం

ఎక్సైజ్ స్టేషన్‌లో రేపు స్వాధీన వాహనాల వేలం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఈనెల 5న వేలం వేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం కార్యక్రమం కాటారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడుతుంది.

జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. వేలంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా ధరావత్తుగా 50 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వాహనం పొందిన వెంటనే మిగిలిన 50 శాతం మొత్తాన్ని అదే రోజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

తుక్కు వాహనాలను కట్ చేసి మాత్రమే తీసుకెళ్లాలని, అలాగే వేలంలో వాహనం పొందిన వారు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు నిర్ణీత సమయానికి హాజరై, నిబంధనలు పాటించాలని కాటారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాదావత్ కిష్టయ్య సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -