బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా సినిమా ‘కిష్కింధ పురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. శుక్రవారం విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని, హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహిం చిన సక్సెస్‌మీట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ,’ఇది చాలా హ్యాపీ మూమెంట్. గురు వారం రోజు మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని మొదలైన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌కి రీచ్ అయింది. ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆదరణ అంత ఇంతా కాదు. మేము చాలా జెన్యూన్‌గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు. దేవుళ్ళు. గొప్ప సినిమాని కాపాడుతారు. ఒక కొత్త జోనర్, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చాలా కషి చేసి, సినిమా చేశాం. దీనికి నిర్మాత సాహు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా చాలా మంచి రేంజ్‌కి వెళుతుంది. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాతో తను చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమాని థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. ఇది అందరికీ నచ్చే సినిమా. పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ వచ్చేంతవరకు మా సినిమా వెళుతూనే ఉంటుంది. 1400 మంది క్రౌడ్‌తో సినిమా చూశాను. రెస్పాన్స్ మామూలుగా లేదు’ అని తెలిపారు.
‘డిస్ట్రిబ్యూటర్స్, ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము అనుకున్న దాని కంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తుంది. ఇండిస్టీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి విష్ చేశారు. మా బ్యానర్‌లో చాలా మంచి సినిమా పడింది. ఈ సినిమా కోసం హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ, దర్శకుడు కౌశిక్‌తో పాటు అందరూ ఎంతో కష్టపడ్డారు. వారి కష్టానికి మంచి ఫలితం లభించడం సంతోషంగా ఉంది’ అని నిర్మాత సాహు గారపాటి చెప్పారు. డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ,’ఫస్ట్ టైం హిట్ కొట్టినప్పుడు ఆ మూమెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ మూమెంట్‌ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. సాహు, సాయి సపోర్ట్‌తోనే ఇది పాజిబుల్ అయింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని తెలిపారు. ‘చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఎక్కడ చూసినా సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ రెస్పాన్స్ మాకు గొప్ప బలాన్ని ఇచ్చింది. మా సినిమాని ఇంత పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్న అందరికీ థ్యాంక్స్’ అని మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ చెప్పారు.
‘కిష్కింధపురి’కి ప్రేక్షకుల రెస్పాన్స్ అదుర్స్
- Advertisement -
- Advertisement -