Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్లూర్ లో ఆడియో రిలీజ్ కార్యక్రమం

ఉప్లూర్ లో ఆడియో రిలీజ్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన గాయకుడు అలిశెట్టి అరవింద్ స్వయంగా రాసి స్వరపరిచిన శంభో శివ శంకర పేరుతో భక్తి పాట ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని పలువురు ఆహుతుల సమక్షంలో  ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గాయకుడు అరవింద్ మాట్లాడుతూ.. గ్రామస్తుల కొంగుబంగారం శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన పై ఉన్న భక్తితో శంభో శివ శంకర పేరుతో పలు భక్తి పాటను ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. తన ప్రయత్నానికి గ్రామానికి చెందిన నందగిరి నరేందర్ ఆర్థికంగా తోడ్పాటు అందించారన్నారు. ప్రజలు తన భక్తి పాటల ను ఆదరించడం ద్వారా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, గ్రామ ప్రముఖులు చింతకుంట శ్రీనివాస్, ఉట్నూరి రవి గౌడ్, సోమ నరేష్, అలిశెట్టి సత్యం, మాసం సాయిరాం గౌడ్, అలిశెట్టి అజయ్, మారుపాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -