- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని కో-ఆప్ రేటివ్ సొసైటీ కార్యదర్శి బాబురావు ఆధ్వర్యంలో 79వ పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. రైతులకు అండగా సొసైటీ ఉంటుందని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైర్మేన్ శివానంద్, సొసైటీ సిబ్బంది రైతులకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి, డైరెక్టర్లు అనితా సింగ్ , సిబ్బంది జావేద్, రైతులు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -