- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలను సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జాతీయ జెండాను ఏవో ఎగురవేశారు. అనంతరం ఎస్సీ కాలనీ ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం అఖిల అంబాటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆహ్వానించి వారికి మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతులు, ఏవో మహేశ్వరితో పాటు ఏఈవో నాగల్ గావ్ క్లస్టర్ సతీష్ , హంగర్గా క్లస్టర్ ఏఈఓ నాందేవ్, పెద్ద ఏడ్గి క్లస్టర్ ఏఈఓ సులోచన, పెద్దగుల్లా క్లస్టర్ ఏఈఓ శ్వేత, సిబ్బంది సురేష్ , అంగన్వాడీ టీచర్లు , పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -