ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – ఆలేరు
200 సంవత్సరాల వలస పాలన లో బానిస బతుకులకు విముక్తి లభించిన రోజు ఈ పంద్రాఆగస్టు భారతీయులందరికీ పర్వదినం అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్.రిజ్వాన్ షేక్ పాషా పర్యవేక్షణలో శుక్రవారం పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో హాజరైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వలస పాలనలో భారత దేశ ప్రజలు బాధలు చెప్పుకుంటూ పోతే 100 పుస్తకాలు రాయచ్చు అన్నారు. తినడానికి తిండి ఒంటికి బట్టలు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కట్టు బానిసలుగా బ్రిటిష్ వాళ్ళు భారతీయులను 200 సంవత్సరాలు పాటు అనేక ఇబ్బందులకు గురిచేసి రక్తపుటేరులు పారించారు.
అనేక మందిని నిర్దాక్షణంగా చంపిన బ్రిటిష్ పాలన అంతమై 79 సంవత్సరాల అయిందన్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరవేసి జనగణమన పాడుకొని చప్పట్లు కొట్టి స్వీట్లు మంచి శుభాకాంక్షలు ఆనందపడడమే కాదు ….భారతదేశ స్వాతంత్రం కోసం అనేకమంది మహానుభావులు తమ ప్రాణాలు సైతం లెక్కపెట్టకుండా వంద సంవత్సరాల పైగా పోరాటానికి వారు కలలు కన్నా స్వాతంత్రం సిద్ధించిన రోజు గా గుర్తుంచుకోవాలన్నారు. భరతమాత సంకెళ్లు తెంచేందుకు మాత్మ గాంధీ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ లాల్ బహుదూర్ శాస్త్రి. అంబేద్కర్ భగత్ సింగ్ రాజ్ గురుసుఖ్ దేవ్ అల్లూరి సీతారామరాజు రాణి లక్ష్మీ బాయి లాలా రజపతి రాయి ఆసిఫ్ ఖాన్. ఆసిఫ్ అలీ తో పాటు దేశవ్యాప్తంగా వేలాదిమంది మహానుభావుల నాయకత్వం లో స్వాతంత్ర పోరాటం జరిగిందన్నారు.
భగత్ సింగ్ ఉరి కంభమే ఎక్కి అల్లూరి సీతారామరాజు బుల్లెట్ల వర్షానికి ఎదురెొడ్డి ప్రాణ త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది అన్నారు. లాటీల దెబ్బలు చెరసాలలో నిర్బంధాలు అనుభవించి మనకు స్వాతంత్రం తెచ్చిన యోధులు చరిత్రలో తమకంటూ గొప్ప పేరుని సంపాదించుకున్న మహాన్నత వ్యక్తులుగా కీర్తింపబడుతున్నారు. ఈరోజు మనమందరం ఇక్కడ స్వేచ్ఛగా వాయువులను పీల్చుకుంటూ సంతోషంగా ఉన్నామంటే వారి పుణ్యమే అని గుర్తుంచుకోవాలన్నారు.వారు చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు చెప్పి దేశభక్తిని పెంపొందించి భారతదేశాన్ని కాపాడాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా వివరించారు ముందుగా ఆలేరు నుండి భారీ కాన్వాయ్ తో జనగాం చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ జిల్లా పాలన అధికారులు ఘనంగాస్వాగతం పలికారు.ప్రభుత్వ విప్ కు డి సి ,పి జిల్లా పోలీసు యంత్రాంగం గౌరవ వందనం చేశారు. జిల్లాల ఉత్తమ పనితీరు చూపిన ప్రభుత్వ ఉద్యోగులకు పురస్కారాలు ఇచ్చారు. జిల్లాలో ఉపాధి పొందుతున్న అవుస్థాయికులు ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు.విద్యార్థులు ఆనందోత్సవాల తో చేసిన నునృత్యాలను తిలకించారు.అనంతరం జనగామ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి తో కలిసి జాతీయ జెండా అని ఎగరవేశారు.జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు పుర ప్రముఖులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.