Thursday, May 29, 2025
Homeఎడిట్ పేజి'ఊరి బడి'ని కాపాడుకోవాలి

‘ఊరి బడి’ని కాపాడుకోవాలి

- Advertisement -

బడి అంటే కేవలం చదువే కాదు, మన జీవితాల పునాది. అది మన ఊరి ప్రగతికి తొలి మెట్టు. ఒక చెరిగి పోని చరిత్ర. ఊరి ప్రజల ఉమ్మడి ఆస్తి. తరతరాలను జ్ఞానం తో తలెత్తుకునేలా చేసే ఊరి వారసత్వ చిహ్నాలు పల్లె బడులు. మన ఊరి పిల్లల్ని ఉన్నత శిఖరాలకి పంపుతున్న విజయ సోపానాలు. మనందరి సామాజిక ప్రగతికి చెరగని గురుతులు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలు నేడు నిర్వీర్యమై పోతుంటే చూస్తుఊరుకోవడం సరికాదు. వాటిని కాపా డుకుని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉన్నది. ముందుగా దీనికి సర్కార్‌ విద్యారంగానికి అత్యున్నత ప్రాధా న్యత నివ్వాలి. ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగేలా బడులను తీర్చిదిద్దాలి.వాస్తవంగా ప్రయివేటు పాఠశాలలు కూడా లాభాలను ఆశించకుండా సేవా కార్యక్రమంలో భాగంగానే వుండాలి, కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నత, మధ్య తరగతి ,పేద వర్గాల వాళ్లందరూ ఒకే ఊరి లోని ఆరకొర మౌలిక వసతులు ఉన్నా సర్కారు బడుల్లోనే చదువుకున్నారు. ఎంతో మంది కలెక్టర్లు , లాయర్లు , ఇంజ నీర్లు, డాక్టర్లు అయ్యారు.ప్రభుత్వాలని ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులుగా అత్యున్నత స్థాయి పదవు లను అధిరోహించారు. అలాచూస్తే ప్రభుత్వ పాఠశాలలే నిజమైన పేదల ప్రగతికి నిలయాలుగా ఉపయోగపడ్డాయి.
అయితే గత కొన్నేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నాణ్యంగా ఉండదని, అరకొర సౌకర్యాలు ఉంటాయనే ఒక దుష్ప్రచారం కొనసాగుతున్నది. సమస్యలు ఉండొచ్చు గాక, వాటిని పరిష్కరించేందుకు తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అది మన బాధ్యతగా, పిల్లల భవిష్య త్తుకు పునాదిగా ఆలోచించాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రయివేటులో తమ పిల్లలను చేర్పించడం వల్ల అధిక ఫీజులతో నష్టపోవడమే. తమ పిలల్ల చదువుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే స్వేఛ్చ తల్లి దండ్రులు ఉంటుంది. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏండ్లుగా టీచర్‌ వృత్తి లక్ష్యంగా కష్టపడి పరీక్షలు రాసి ఉద్యో గాలు సాధించిన అత్యున్నత బోధనా నైపుణ్యం గల టీచర్లు ఉన్నప్పటికీ వారిని వినియోగించుకోవడం లేదు. వారి జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పిల్లలకి అందించటానికి సిద్ధంగా ఉన్నా ప్రయివేటులో ఇంటర్‌, డిగ్రీ పాసై చదువుల్ని బోధించే వారి వెంట పడుతున్నారు. ఇది బాధాకరం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అది సర్కార్‌ కు అనేక సూచనలిచ్చింది. దాని సిఫార్సుల మేరకు విద్యకు బడ్జెట్‌ను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. మారుతున్న తరానికి టెక్నాలజీకి అనుగుణంగా పిల్లలకి కంప్యూటర్‌లని స్కూళ్లలో ఏర్పాటు చేయడం, ప్రొజెక్టర్‌, డిజిటల్‌ బోర్డు లను ఉపయోగించడం, ప్రయివేటుకు దీటుగా డిజిటల్‌ క్లాసులు చెప్పడం, బట్టి చదవులు కాకుండా పిల్లలకు అవసర మయ్యే లా బోధనకు ప్రభుత్వం కూడా పూనుకోవడం మంచి విషయమే.అయితే, ఇది పూర్తి ఆచరణలోకి, అన్ని పాఠ శాలల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తల్లి దండ్రుల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి. అలాగే మీ బిడ్డలు మీ ఊర్లో, మీకు దగ్గరలో వుండి చదువుకుంటే, మంచి కుటుంబ విలువలు నేర్చుకోవడంతో పాటు మానసిక ఆనం దంలో చదువుల్లో రాణిస్తారన్నది తల్లిదండ్రులు ఆలో చించాలి. ఆర్థికంగా ఉన్నవారు లక్షల రూపాయల ఫీజులు కట్టి వారి పిల్లల్ని ప్రయివేటులో చేర్పిస్తారు. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లడంతో సామాన్యులు సైతం అదే దారి పడుతున్నారు. అప్పులు చేసి ఫీజులు కడు తున్నారు. తలకు మించిన ఆర్థిక భారాన్ని మోస్తున్నారు.
సర్కార్‌ బడి తల్లిఒడి లాంటిది. అది మనందరి బడి. ఒకప్పుడు ఊరి బడిలో చదువుకుని, జ్ఞానఫలాలు అందు కుని ఎదో ఒకరకంగా చాలామంది మంచి స్థాయిల్లో ఉన్న వారున్నారు. వారందరిని గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు అం దరం అప్పటి చదువుకి ఎంతోకొంత తిరిగి బడికి చెల్లిం చాల్సిన సమయమిది. బడికి ఇవ్వటమంటే సమాజానికి ఇస్తున్నట్లే (గివ్‌ బ్యాక్‌ టు సొసైటీ), మన మాటలో అయితే పుట్టిన ఊరు, చదివిన బడి రుణం తీర్చుకోవటం అన్న మాట. అది ఏ విధంగానైనా కావచ్చు, ఆర్థిక సాయం,లేదా జ్ఞాన నైపుణ్యం పిల్లలకి నేర్పించటం అవ్వచ్చు.అంతేకాదు, మీ ఊరి పిల్లలని బడిలో చేర్పించటానికి మీ విలువైన సమ యాన్ని కూడా ఇవ్వచ్చు. అలా ప్రజలందరి సహకారంతో మళ్లీ మనఊరి బడి చిగురించేందుకు తోడ్పాటునందించాలి.
– గజ్జెల గంగాధర్‌,9704117426

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -