Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అరోరా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

అరోరా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 
యూనివర్సిటీలో గుర్తింపును రద్దు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో ఉన్న అరోరా యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని అరోరా యూనివర్సిటీ  నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లావుడియ రాజు  మాట్లాడుతూ ఎన్ఐటి పేరుతో అడ్మిషన్ తీసుకొని యూనివర్సిటీ జతకట్టినారు. అరోరా యూనివర్సిటీ అడ్మిషన్ సమయంలో  ఏఐతో వీడియో చేసి వీడియోలో ఉన్నట్లుగా యూనివర్సిటీలో మౌలిక  సదుపాయాలు ఉంటాయని నమ్మించి, విద్యార్థుల నుండి రూ.10 నుండి 11 లక్షలు పాటు ఫీజులు తీసుకుంటున్నారని తెలిపారు.

యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేకసార్లు యజమాని దృష్టికి తీసుకెళ్లడానికి చూసి చూడనట్టుగా వివరిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్లో  విద్యార్థులకు సరైన భోజనం పెట్టాక దానిమీద భోజనం పెట్టక తినే తినకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, హాస్టల్లో సరిపడా మౌలిక సదుపాయాలు లేక కాలయాపన  చేస్తున్నారు, విద్యార్థులతో యూనివర్సిటీ  యజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బయట హాస్టల్ నుంచి వస్తున్న విద్యార్థులకు బస్సులను యూనివర్సిటీలో రానీయకుండా రోడ్లమీద ఆపుతున్నారు.

యూనివర్సిటీకి సరైన రోడ్లు లేక , ఆట స్థలం లేక యూనివర్సిటీలో ఆడిటోరియం,  సెమినార్ హాల్ లేక కాలం గడుపుతున్నారు, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందక విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి నెలకొందని,  యజమాన్యం  త్వరగా స్పందించి  సమస్యను పరిష్కరించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న యూనివర్సిటీపై చర్యలు తీసుకొని యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని సుబ్బయ్య డిమాండ్ చేశారు.  యూనివర్సిటీ అధికారులు ధర్నా దగ్గరకు వచ్చి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని తెలియజేయడంతో విద్యార్థులు ధర్నా విరమించడం జరిగిందనారు. 

యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్,నాగరాజు, తీగల శ్రీనివాస్, జగన్ నాయక్, ఉదయ్ ,పట్టణ అధ్యక్షులు నేహాల్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -