– తొలి ఇన్నింగ్స్‌లో 212 కుప్పకూలిన కంగారు జట్టు
– స్మిత్, వెబ్‌స్టెర్ అర్ధసెంచరీలు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్లో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా సంచలన బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేశాడు. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమైన డబ్ల్యుటిసి ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను రబడా ఐదు వికెట్లు పడగొట్టి కట్టడి చేశాడు. దీంతో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. మూడో సెషన్లో 5వికెట్ల నష్టానికి 190 పరుగులతో పటిష్టంగా ఉన్న ఆసీస్ జట్టు 22 పరుగులకే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. బ్యూ వెబ్‌స్టర్ (72; 92 బంతుల్లో 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని సఫారీ బౌలర్లు సార్థకం చేస్తూ.. ఉస్మాన్ ఖవాజాను రబడా డకౌట్ చేశాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ (4)ను తక్కువ పరుగులకే పెవీలియన్‌కు పంపాడు. మ్యాచ్ మొదలైన కాసేపటికే కగిసో రబాడ ఒకే ఓవర్లో ఉస్మాన్ ఖవాజా (0), కామెరూన్ గ్రీన్ (4)ను ఔట్ చేశాడు. వీరిద్దరూ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. మార్నస్ లబుషేన్ (17బీ 56 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (11)ని మార్కో యాన్సెన్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపాడు. హెడ్ ఔటైన తర్వాత భోజన విరామం ప్రకటించారు. లంచ్ సమయానికి ఆసీస్ 67/4తో ఉంది. స్టీవ్ స్మిత్ (26లిబీ 51 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. తొలి సెషన్లో సఫారీ బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ జట్టు లంచ్‌లోపే నాలుగు వికెట్లు పడగొట్టి పట్టు బిగించారు. తొలి సెషన్లో 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్ కోల్పోయి 123 పరుగులు చేసింది. ఆ తర్వాత టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 5వికెట్ల నష్టానికి 190 పరుగులతో పటిష్టంగా నిలిచింది. టీ విరామ సమయానికి స్టీవ్ స్మిత్ (66) వెబ్‌స్టర్ (55) క్రీజ్‌లో ఉన్నారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు అప్పటికే 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగారు. క్రీజ్‌లో కుదురుకున్న స్మిత్‌ను పార్ట్‌టైమ్ బౌలర్ మార్క్‌క్రమ్, వెబ్స్టెర్ను రబడా ఔట్ చేశారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సఫారీ బౌలర్లు క్రీజ్‌లో కుదురుకోనివ్వలేదు. కెప్టెన్ పాట్ కమిన్స్ (1)ను సింగిల్ డిజిట్‌కే పెవీలియన్‌కు పంపిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. లియాన్(0), స్టార్క్(1)లను పెవీలియన్‌కు పంపారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 15 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. మార్క్రమ్(0), రికెల్టన్(16), ముల్డర్(6) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్‌కు రెండు, కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
చరిత్ర సృష్టించిన స్మిత్ :
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యుటిసి ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను వెబ్‌స్టెర్‌తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్‌లో 18 సార్లు యాభైకు పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బోర్డర్ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. అలాగే లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్‌లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.
స్కోర్‌బోర్డు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖవాజా (సి)బెడింగ్హామ్ (బి)రబడా 0, లబూషేన్ (సి)వెర్రెయానే (బి)యాన్సెన్ 17, గ్రీన్ (సి)మార్క్రమ్ (బి)రబడా 4, స్మిత్ (సి)యాన్సెన్ (బి)మార్క్రమ్ 66, హెడ్ (సి)వెర్రెయానే (బి)యాన్సెన్ 11, వెబ్‌స్టెర్ (సి)బెడింగ్హామ్ (బి)రబడా 72, క్యారీ (బి)మహరాజ్ 23, కమిన్స్ (బి)రబడా 1, స్టార్క్ (బి)రబడా 1, లియాన్ (బి)యాన్సెన్ 0, హేజిల్‌వుడ్ (నాటౌట్) 0, అదనం 17. (56.4ఓవర్లలో ఆలౌట్) 212పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/16, 3/46, 4/67, 5/146, 6/192, 7/199, 8/210, 9/211, 10/212
బౌలింగ్: రబడా 15.4-5-51-5, యాన్సెన్ 14-5-49-3, ఎన్గిడి 8-0-45-0, ముల్డర్ 11-3-36-0, మహరాజ్ 6-0-19-1, మార్క్రమ్ 2-0-5-1.
రబడా దెబ్బకు ఆసీస్ ఢమాల్
- Advertisement -
- Advertisement -