- Advertisement -
హౌబర్ట్ : అలీసా హీలీ (158, 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీడ్కోలు వన్డేలో విశ్వరూపం చూపించింది. భారత బౌలర్లపై దండయాత్ర చేసిన అలీసా 79 బంతుల్లోనే సెంచరీ సాధించింది. బెత్ మూనీ (106 నాటౌట్), జార్జియా వోల్ (62) మెరవటంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు రికార్డు 409 పరుగులు చేసింది. ఛేదనలో భారత మహిళల జట్టు 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. 185 పరుగుల తేడాతో ఆసీస్ అమ్మాయిలు ఏకపక్ష విజయం సాధించారు. 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. భారత్, ఆసీస్ అమ్మాయిల ఏకైక టెస్టు శుక్రవారం నుంచి పెర్త్‌లో ఆరంభం కానుంది.
- Advertisement -



