శ్రీలంకతో మ్యాచ్ రద్దు
ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్
కొలంబో: ఐసిసి మహిళల ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ రద్దయ్యింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్‌కు టాస్ ముందు నుంచి వాన కురుస్తూనే ఉండడంతో ఆట రద్దయ్యింది. దాంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మధ్నాహ్యానికి ఇరుజట్ల ప్లేయర్లు స్టేడియానికి చేరుకు న్నారు. కానీ, టాస్ వేద్దామనుకునే సమయానికి వాన మొదలైంది. ఆ తర్వాత అది భారీ వర్షంగా మారింది.
కటాఫ్ సమయం రాత్రి 8:00 గంటలు తర్వాత కూడా వర్షం తగ్గలేదు. దీంతో రిఫరీ, అంపైర్లు కెప్టెన్లు ఆటపట్టు, అలీసా హేలీతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్, లంకకు చెరొక పాయింట్ దక్కింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 89 పరుగులతో ఓడించిన కంగారూ టీమ్‌కు మూడు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. శ్రీలంక జట్టు మాత్రం ఒకే ఒక పాయింట్‌తో ఐదో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్, భారత్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డెవాన్‌షైర్ ఔట్..
మహిళల వన్డే వరల్డ్ కప్‌ను ఓటమితో ప్రారంభించిన న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న ఆల్‌రౌండర్ ఫ్లోరా డెవాన్‌షైర్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం నెట్స్‌లో సాధన సమయంలో ఫ్లోరా గాయపడింది. ఫీల్డింగ్ చేస్తుండగా ఈ యంగ్‌స్టర్ ఎడమ చేయికి బలమైన గాయమైంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కోలుకునేందుకు కనీసం రెండు నుంచి మూడు వారాలు సమయం పడుతుందని తెలిపారు.
దాంతో.. ఫ్లోరా స్థానంలో సీనియర్ క్రికెటర్ హన్నా రొవేను ఎంపిక చేశారు సెలెక్టర్లు. మాత్ హన్నా రొవేకు ఇది మూడో వరల్డ్ కప్. పేస్ ఆల్‌రౌండర్ అయిన ఆమెకు 60 వన్డేలు ఆడిన అనుభవం ఉంది. ‘మేమం దరం ఫ్లోరా వైదొలగడంతో చాలాబాధ పడుతున్నాం. తను వరల్డ్ కప్ ఆడడం కోసం చాలా కష్టపడింది. అవకాశం లభించిందనే సంతోషంలో ఉన్న తను గాయపడడంతో ఆరంభంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది’ అని హెడ్‌కోచ్ బెన్ సాయెర్ వెల్లడించింది.