వాణిజ్య సంబంధాల బలోపేతంపైనే దృష్టి
బీజింగ్ : వారం రోజుల చైనా పర్యటనలో భాగం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బనీస్ ఆదివారం బీజింగ్‌కు చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అల్బనీస్ ఈ పర్యటన సాగిస్తున్నారు. ఆదివారం షాంఘై పార్టీ కార్యదర్శి చెన్ జినింగ్‌తో అల్బనీస్ సమావేశం జరిపారు. 2022లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అల్బనీస్‌కు ఇది రెండో చైనా పర్యటన. ఇతర ఉత్తరాసియా దేశాలతో పోలిస్తే చైనాతో సంబంధాలు ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యమైనవని అల్బనీస్ ఈ పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. వారం రోజుల పర్యటన కోసం శనివారం ఆయన షాంఘై చేరుకున్నారు. మంగళవారం వ్యాపార, పర్యాటక, క్రీడా రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో అల్బనీస్ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని వెంట అధికారులు, వాణిజ్య వేత్తలతో కూడిన భారీ బృందం కూడా ఉంది. కాగా, ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన గురించి చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే జిన్హువా ఆదివారం ఒక సంపాదకీయం ప్రచురించింది. ఆస్ట్రేలి యాతో చైనా సంబంధాలు క్రమంగా మెరుగుప డుతోందని, తాజాగా ఊపు అందుకుందని అభివర్ణించింది. చైనా, ఆస్ట్రేలియా మధ్య ఎలాంటి సంఘర్షణలు లేవని, పరస్పర గౌరవం ద్వారా విభేదాలను పరిష్కరించడం, ఉమ్మడి ప్రయోజనాలను సాధించడం చేయవచ్చునని సంపాదకీయం తెలిపింది.
చైనా పర్యటనలో ఆసీస్ ప్రధాని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES