Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంత్వరలో 'ఆస్ట్రేలియా యూనివర్సిటీ'

త్వరలో ‘ఆస్ట్రేలియా యూనివర్సిటీ’

- Advertisement -

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించే ఆస్ట్రేలియా యూనివర్సిటీ త్వరలో ఏర్పాటు కానుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆస్ట్రేలియా వాణిజ్య ప్రతినిధులు మంత్రిని కలిసి యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ విశ్వవిద్యాలయానికి తోడు మరో ఉన్నత స్థాయి టెక్నాలజి క్యాంపస్‌ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయని అన్నారు. కృత్రిమ మేథ వేగంగా విస్తరిస్తున్నందున గ్లోబల్‌ సామర్థ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మూడు లక్షలకు పైగా సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లతో పాటు, చదువులు పూర్తి చేసుకునే విద్యార్థులకు నూతన నైపుణ్యాల శిక్షణ అవసరమవుతుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ఏర్పాటుపై పూర్తి ప్రణాళికతో ముందుకు వస్తే పరిశీలిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సిడ్నీ బోర్గ్‌, నీలిమా చౌదరి, హైడన్‌ షటిల్‌ వర్త్‌, సురేన్‌ పథర్‌, యాండ్రే స్కోమన్‌, కొల్లా నాగ లోకేశ్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad