లల్లాదేవిగా పాఠకులకు, ప్రేక్షకులకు సుపరిచితులైన పరుచూరి నారాయణ చార్యులు (80) ఇకలేరు. వృద్ధాప్యంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సి పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కథలు, చారిత్రక, సాంఘిక నవలలు, నాటకాలు వంటివి దాదాపు 250కి పైగా రచన చేశారు. ఆయన రాసిన వాటిల్లో ‘ఆమ్రపాలి’, ‘మహామంత్రి తిమ్మరసు’ వంటి నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే 14 నవలలు కన్నడంలోకి అనువదించారు. ‘సామ్రాట్ అశోక్’, సౌందర్య నటించిన ‘శ్వేతనాగు’ వంటి సినిమాలు ఈయన రచనల ఆధారంగా తెరకెక్కినవే. లల్లాదేవికి భార్య ఆదిలక్ష్మీ, కుమార్తె హరి ప్రసన్నరాణి ఉన్నారు. కొడుకు నందగోపాల్ ఇటీవల మరణించారు. లల్లాదేవి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.