నవతెలంగాణ – హైదరాబాద్: యజమాని హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ వంటమనిషికి కువైట్‌లో మరణశిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. ముస్తకీం సుమారు ఏడేళ్లుగా కువైట్‌లో రెహానా ఖాన్ అనే మహిళ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. 2019లో యజమాని రెహానా ఖాన్‌తో ముస్తకీంకు వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి, తీవ్ర ఘర్షణకు దారితీయడంతో ముస్తకీం ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కువైట్ పోలీసులు ముస్తకీంను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం 2021లో న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపించారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు.
కువైట్ లో భారతీయున్ని ఉరి తీసిన అధికారులు
- Advertisement -
RELATED ARTICLES