Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

అధికారులు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

- Advertisement -

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
నవతెలంగాణ- వనపర్తి  

ఈనాటి అధికారులంతా ఆనాటి ఐఏఎస్ అధికారి శంకరం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి సూచించారు. ఎస్ ఆర్ శంకరన్ (ఐఏఎస్ ) 91 జయంతి ని పురస్కరించుకొనివనపర్తి పట్టణ కేంద్రంలో గ్రీన్ పార్క్ లోని శంకరన్ విగ్రహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ శంకరన్ తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్ గ్రామంలో జన్మించి విద్య పట్ల శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి 22 సంవత్సరాలకే ఐఏఎస్ అధికారి అయ్యారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించి ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన జీతాన్ని కూడా పేద విద్యార్థుల విద్యకై ఖర్చు పెట్టే వారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ హింస ను అంతం చేయడానికి ఎస్ ఆర్ శంకరన్ నేతృత్వంలో శాంతి చర్చలు జరిపి రాష్ట్రంలో హింస ను అరికట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకరన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పలు శాఖలకు కార్యదర్శిగా ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమం ద్వారా రెసిడెన్షియల్ స్కూల్స్, బిసి ,ఎస్సీ, ఎస్టి, వెల్ఫేర్ ద్వారా ఉచిత విద్యను అందించారని తెలిపారు. పద్మభూషణ్ అత్యున్నత పౌర గౌరవాన్ని కూడా తిరస్కరించిన గొప్ప వ్యక్తి ఎస్ ఆర్ శంకరన్ అని అన్నారు.

శంకరన్ కలెక్టర్ , ప్రిన్సిపల్ సెక్రెటరీ, పలు శాఖల కార్యదర్శిగా ప్రత్యేక కార్యదర్శిగా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహించిన ఒక్క అవినీతి మచ్చ లేకుండా నీతి నిజాయితీతో పనిచేసిన అధికారి కాబట్టే ఈనాటి అధికారులు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి జిల్లా ఏఐపిసి ఉపాధ్యక్షులు నాగార్జున, వనపర్తి జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు రోహిత్, శంకర్ గౌడ్ , వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నాయకులుఇర్ఫాన్ , మాజీ కౌన్సిలర్ ప్రేమ్ నాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి, వాకిటి బాలరాజ్, కోళ్ల వెంకటేష్, జానంపేట నాగరాజు, ఎంట్ల రవి, రామ్ సింగ్ నాయక్, మన్యం యాదవ్, అబ్దుల్లా, నందిమల్ల రాము, లక్ష్మయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -