Wednesday, November 5, 2025
E-PAPER
Homeక్రైమ్పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మీన్‌రెడ్డి అనే డ్రైవర్‌ మంగళవారం సాయంత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కాడు. పరీక్షలో రీడింగ్‌ 120 రావడంతో అతడిపై కేసు నమోదు చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

అయితే అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మీన్‌రెడ్డి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఆర్పేందుకు స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు యత్నించారు. కానీ, అప్పటికే అతని ఒళ్లు సగానికిపైగా కాలిపోయింది. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే అతడు మృతిచెందాడు. మీన్‌రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మీన్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -