Monday, March 30, 2026
E-PAPER
Homeఖమ్మంఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలి

ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలి

- Advertisement -

బోనకల్ ఉపసర్పంచ్ బానోత్ కొండ 
నవతెలంగాణ – బోనకల్ 

ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్య ప్రాంతాలకు చేర్చాలని బోనకల్ ఉప సర్పంచ్ బానోతు కొండ కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు లోనే స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో వైరా – మధిర, బోనకల్ – పొద్దుటూరు ఆటో అడ్డా సెంటర్లను బోనకల్ ఉపసర్పంచ్ బానోత్ కొండ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రజల్ని సురీక్షిత ప్రాంతాలకు చేరేదాకా ఆటోను జాగ్రత్తగా నడపాలని కోరారు. బోనకల్ గ్రామంలో తాము చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. గ్రామాభివృద్ధికి తమ శక్తి మేరకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా తమశక్తి మేరకు అభివృద్ధి చేస్తున్నట్లయితే తెలిపారు.

సిఐటియు జిల్లా నాయకులు బోయినపల్లి వీరబాబు, మండల కన్వీనర్ గుగులోతు నరేష్ మాట్లాడుతూ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 4500 ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉపయోగపడే విధంగా మోటార్ వాహన చట్టం 2019ని సవరించాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ఆన్లైన్ల యాప్ ను రద్దుచేసి ప్రభుత్వ యాప్ తీసుకురావాలని, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని త్వరలోనే సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ వెళుతున్న ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు షేక్ గౌస్ ను అరెస్టు చేయటం దుర్మార్గ చర్యని, వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ ఖాదర్ బాబా, ఆటో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు నాగంటి బాబు, బోనకల్ మాజీ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, సిఐటియు నాయకులు షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -