- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: నార్సింగ్ పరిధి బాబు జగ్జీవన్ రామ్ కమిటీ హాల్ సమీపంలో ఓ ఆటో పల్టీలు కొట్టింది. అతివేగంగా దూసుకొచ్చిన ఆటో మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



