Friday, January 9, 2026
E-PAPER
Homeమానవిఆటో క్వీన్స్‌

ఆటో క్వీన్స్‌

- Advertisement -

పురుషుల ఆధిపత్యం బలంగా ఉన్న ఎన్నో రంగాలలోకి మహిళలు కూడా ధైర్యంగా అడుగుపెడుతున్నారు. అలాంటి వాటిలో ఆటో డ్రైవింగ్‌ కూడా ఒకటి. మహిళా ఆటో డ్రైవర్లుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అవమానాలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి అడ్డంకులు ఛేదించి అనేక విజయాలు సాధిస్తున్న మహిళలు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అటువంటి ఓ మహిళ కథే ‘ఆటో క్వీన్స్‌’గా ఇటీవల విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఆ డాక్యుమెంటరీ విశేషాల గురించి నేటి మానవిలో…

ఈ డాక్యుమెంటరీ భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఆటోరిక్ష డ్రైవర్ల యూనియన్‌ అయిన వీర పెంగల్‌ మున్నేత్ర సంగం(వీపీఎంఎస్‌)ను మనకు పరిచయం చేస్తుంది. ఆ మహిళలను పోరాడుతున్న అసాధారణ వ్యక్తులుగా మాత్రమే కాకుండా, వారి దైనందిన జీవితాలతో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మన కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది. సాధారణంగా ఈ పురుషాధిక్య వృత్తిలో పురుష డ్రైవర్లకే ఆటో స్టాండ్‌లపై నియంత్రణ ఉంటుంది. ట్రాఫిక్‌ పోలీసులు, ప్రయాణీకులు, తోటి డ్రైవర్లతో రోజువారీ చర్చలు జరపాలి. అయితే మహిళా డ్రైవర్లకు ఇవన్నీ వేధింపులుగా మారిపోయాయి. వీరి బతుకు తెరువు దుర్బలంగా మారిపోయింది.

వాట్సాప్‌ గ్రూపుగా మొదలై…
ఈ దుర్బలత్వానికి ప్రతిస్పందనగానే వీపీఎంఎస్‌ ఉద్భవించింది. ఇది మొదట ఒక చిన్న వాట్సాప్‌ గ్రూప్‌గా ప్రారంభమైంది. ఇక్కడ మహిళా డ్రైవర్లు ఒకరితో ఒకరు తమ సమస్యల గురించి పంచుకుంటారు. వారికి ఎదురయ్యే రోజువారీ అవమానాల గురించి చెప్పుకుంటారు. కాలక్రమేణా ఇది నెలవారీ విరాళాలు, తక్కువ వడ్డీ రుణాలు, అనారోగ్యం, సంక్షోభ సమయంలో చట్టపరమైన, అత్యవసర సహాయం అందించే మహిళా డ్రైవర్ల రిజిస్టర్డ్‌ యూనియన్‌గా ఎదిగింది. మహిళా డ్రైవర్లను ఆటో స్టాండ్ల నుండి బయటకి పంపినపుడు వారికి మద్దతుగా నిలబడటం, పురుష డ్రైవర్లు, అధికారులతో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మాట్లాడడం, వృత్తిలోని గౌరవాన్ని నొక్కి చెప్పడానికి యూనియన్‌ సహాయపడుతుంది. ఆటో క్వీన్స్‌ వీపీఎంఎస్‌ అధ్యక్షురాలు మోహన సుందరి, యూనియన్‌ కోశాధికారి లీలా రాణి మధ్య స్నేహాన్ని మరింత పెంచింది. మొదట్లో ఉమ్మడి ప్రతిఘటనలో ఏర్పడిన వారి బంధం రోజువారీ ఆనందాల ద్వారా ఏర్పడిన సున్నితమైన సహవాసంగా మారింది.

వారికి ఆనందం అవసరం
కేవలం కష్టాలు, సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా బీచ్‌లో ఎక్కువ సేపు గడుపుతుంటారు. తమ పోరాటాలను గుర్తు చేసుకుంటూనే ఆనందంగా పాటలు పాడుకుంటారు. ‘సాధారణ విషయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. అందుకే ఇలాంటి సినిమా ఒకటి తీయాలని ఎప్పటి నుండో భావిస్తున్నాను’ అని శ్రాయంతి చెప్పారు. ‘సాధారణంగా మనకు అందుబాటులో ఉండే డాక్యుమెంటరీలు చాలా ప్రామాణికమైనవి, ఇంటర్వ్యూ ఆధారితమైనవి. ఇందులో మీరు ప్రజల జీవితాల గురించి తెలుసుకుంటారు. కానీ ఆ పాత్రలోకి మీరు ప్రవేశించలేరు’ అంటారు శ్రాయంతి. సంతోషం, విశ్రాంతికి మహిళలు ఎంతగా దూరమైపోతున్నారో ఆమె గమనించారు. అలాగే అట్టడుగు వర్గ ప్రజల జీవితాలకు దూరంగా ఉన్న వారికి ఇలాంటి డాక్యుమెంటరీలు ఆ లోటును తీర్చేస్తాయని ఆమె అంటున్నారు.

సమాజం వైపు నడిపిస్తుంది
ఆటో క్వీన్స్‌ పోరాడేందుకు ఏమాత్రం వెనకడుగు వేయారు. ఆమెను వేధించే, బెదిరించే పురుషులతో రాణి ఆవేశపూరిత ఘర్షణలు ఈ చిత్రానికి ప్రధానమైనవి. న్యాయం కోసం పోరాడే ఆమె తరచుగా వేధింపులను ఎదుర్కొంటుంది, కొన్నిసార్లు పురుషులతో కొట్లాటలు జరుగుతాయి. దీనికి విరుద్ధంగా సుందరి స్థిరత్వం, ప్రశాంతత కలిగి ఉంటుంది. రాణితో పాటు యూనియన్‌లోని ఇతర మహిళా డ్రైవర్లను ఈ చిత్రం సమాజం వైపు నడిపిస్తుంది. సంభాషణ ఊహించినట్లుగానే ప్రారంభమవుతుంది. వారు వృత్తిలోకి ఎలా ప్రవేశించారు, ఎదుర్కొంటున్న వేధింపులు, ప్రపంచంలో చూడాలని వారు కోరుకుంటున్న మార్పులు అన్నీ మనకు కనిపిస్తాయి. రాణి, సుందరి శ్రాయంతికి అక్కచెల్లెళ్లుగా కనిపిస్తారు. సాధారణంగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు ఆటపట్టించడం చూసి చిత్రనిర్మాత వారి స్నేహం నుండి ఉద్భవించిన సంఘీభావాన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకుంది.

రాజకీయాలు ప్రభావితం చేస్తాయి
మహిళా డ్రైవర్లు చెన్నైలోని వివిధ ప్రాంతాలకు ఎలా ప్రయాణిస్తారో మనకు చూపిస్తారు. ఇందులో కులం, మత పరంగా అలాగే పొరుగున వుంటే ప్రాంతాల నుండి ఎలాంటి అనుభవాలు పొందారో కూడా ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. వలస కార్మికులు, కులం పేరుతో ఇప్పటికే వేరు చేయబడిన నగరంలో మహిళలు ప్రయాణించడం, పోటీ పడటం ఎలా ఉంటుందో చూడొచ్చు. రోజువారీ జీవితంపై దృష్టి పెట్టాలనుకున్న శ్రాయంతి ఈ చిత్రం ద్వారా రాజకీయాలను కూడా ప్రస్తావించారు. ‘యూనియన్‌ పేరు వినగానే రాజకీయ నాయకులకు వెంటనే ఒక అడుగు వెనక్కి వెళతారు’ అని ఆమె చెప్పింది. అయితే రాజకీయాలు వ్యక్తిగతం. కానీ రాజకీయాలు అందరి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నిర్మాత అంటున్నారు.

తమను తాము చూసుకుంటారు
తన సౌండ్‌ టీమ్‌ అయిన పుతిర బాలన్‌, రాఘవ్‌ మహిళలు ఏమి చెబుతున్నారో వారిలో కోపం, ధిక్కరణ ఎలా వ్యక్తమవుతున్నాయో అవన్నీ ప్రేక్షలకు ఎలా అర్థం చేయించాలో నిశితంగా గమనించారని ఆమె చెప్పారు. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్‌ ప్రేమ్‌ అక్కట్టు సంవత్సరం 16 రోజుల పాటు చిత్రీకరించారు. తమ చిత్రం ద్వారా మహిళలకు తగినంత స్థలాన్ని, కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్న వారి జీవితాలను గుర్తించేందుకు వీలు కల్పించారు. వీపీఎంఎస్‌ సభ్యులందరూ కలిసి సినిమా చూసినప్పుడు ప్రదర్శన తర్వాత హర్షధ్వానాలు, నవ్వులతో ఆ ప్రదేశం నిండిపోయింది. ‘మాకు ఒక పెద్ద హీరో సినిమా చూస్తున్నట్లు అనిపించింది. అంతకు మించి, ప్రజలు తమను తాము తెరపై చూస్తున్నట్లు భావించడం నేను చూడగలిగాను. వారి సొంత జీవితాలు వారికి తిరిగి ప్రతిబింబిస్తాయి’ అని శ్రయాంతి అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -