- ప్రయాణికుల కోసం ఆటోవాలా పడిగాపులు..
– బస్సుల కోసమే మహిళా ప్రయాణికుల ఎదురుచూపు..
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండులో ఆటోలకు గిరాకీలు లేక డ్రైవరన్నలు ఆగమవుతున్నారు. ఎండలో ఎంత సేపు ఆటోను నిలిపినా ప్రయాణికులు ఎక్కట్లేడని, బస్సుల్లోనే ఎక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు పాత బస్టాండు నుండి వివిధ ఊర్లకు వెళ్లేవారు ఎక్కువగా ఆటోల్లోనే ప్రయాణించేవారు. కానీ ఇప్పుడలా లేదు. ఉచిత బస్సు సౌకర్యం మూలంగా మహిళలంతా బస్సుల కోసమే వేచి చూస్తున్నారు. బస్టాండ్ లో మహిళా ప్రయాణికులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- Advertisement -