- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఆటో డ్రైవర్లలో ఆగ్రహం వెల్లువెత్తింది. రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆత్మకూరు పోలీసులు నేరుకుళ్ళ శ్రీ చెన్నకేశవ ఆటో యూనియన్ సభ్యులు ఉడుత తిరుపతి, సిలివేరు శ్రీనివాస్, గౌని రాజులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
యూనియన్ నాయకులు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, శాంతియుతంగా బయలుదేరే ముందు నుంచే అరెస్టులు జరపడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అరెస్టయిన సభ్యులను వెంటనే విడుదల చేయాలని, ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.
- Advertisement -



