Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల భద్రత కోసం 24 గంటలు అందుబాటులోనే

ప్రజల భద్రత కోసం 24 గంటలు అందుబాటులోనే

- Advertisement -

వర్ధన్నపేట ఏసీబీ అంబటి నరసయ్య
నవతెలంగాణ – వర్ధన్నపేట
వర్దన్నపేట రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వర్ధన్నపేట ఎసిపి అంబటి నరసయ్య అన్నారు. వర్దన్నపేట లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వరంగల్ సి పి సంప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు, జనగామ డిసిపి రాజమహేంద్రనాయక్ గ సూచనలతో, కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్దన్నపేట ఎసిపి అంబటి నర్సయ్య మాట్లాడుతూప్రజలకు సేవలు అందించడంతోపాటు వారి భద్రత కోసం 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటూ వారికి రక్షణగా నిలుస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్సైసాయిబాబు, ఎస్సై రాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలను పలు వాహనాల డ్రైవర్లను వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు ఆహ్వానించారు. కాకతీయ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం సహకారం పలువురికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి పలువురికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాహనదారులు స్థానిక ప్రజలు వృద్ధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -