Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆటలుతైక్వాండోలో అవనీష్‌ సత్తా

తైక్వాండోలో అవనీష్‌ సత్తా

- Advertisement -

జాతీయ పోటీల్లో కాంస్య పతకం

హైదరాబాద్‌ : ఇటీవల ముగిసిన సిబిఎస్‌ఈ జాతీయ తైక్వాండో పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన అవనీష్‌ బొలిశెట్టి సత్తా చాటాడు. అండర్‌-17 విభాగంలో పోటీపడిన అవనీష్‌.. కాంస్య పతకం దక్కించుకున్నాడు. బోయిన్‌పల్లిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న అవనీష్‌.. తిరుమలగిరిలోని కంబాట్‌ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. నేషనల్‌ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన అవనీష్‌ను కోచ్‌ నరసింహ, తల్లిదండ్రులు బిందు కిరణ్‌, మమతా జైన్‌ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన అవనీష్‌.. పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 25కు పైగా పతకాలు సాధించాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad