Saturday, September 27, 2025
E-PAPER
Homeబీజినెస్ఇంటీరియర్స్‌పై సగటున రూ.4.9 లక్షల వ్యయం

ఇంటీరియర్స్‌పై సగటున రూ.4.9 లక్షల వ్యయం

- Advertisement -

మ్యాజిక్‌బ్రిక్స్‌ వెల్లడి
హైదరాబాద్‌ : నగరంలో హోం ఇంటీరియర్స్‌ మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. 2030 నాటికి దీని విలువ 2.9 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.25వేల కోట్లు)కు చేరుతుందని ఆన్‌లైన్‌ రియల్‌ఎస్టేట్‌ పోర్టల్‌ మ్యాజిక్‌బ్రిక్స్‌ అంచనా వేసింది. మ్యాజిక్‌ బ్రిక్స్‌ విడుదల చేసిన ‘బియాండ్‌ వాల్స్‌: ట్రెండ్స్‌ అండ్‌ ప్రొజెక్షన్స్‌ ఇన్‌ ఇండియాస్‌ హోం ఇంటీరియర్స్‌ మార్కెట్‌’ రిపోర్ట్‌ ప్రకారం.. హైదరాబాద్‌ గృహ యజమానులు ఇంటీరియర్స్‌పై సగటున రూ.4.9 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది ఢిల్లీలో రూ.5.8 లక్షలుగా, బెంగళూరులో రూ.5.2 లక్షలుగా ఉంది. సరైన ఇంటీరియర్స్‌ ఒక ఆస్తి రీసేల్‌ విలువను 70శాతం వరకూ పెంచగలదని తెలిపింది. అద్దె విలువలలో కూడా 10శాతం నుంచి 45శాతం వరకు పెరుగుదల సాధ్యమవుతుందని వెల్లడించింది. కాగా.. రెండు, మూడు పడక గదుల ఇళ్లలోనే ఇంటీరియర్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -