- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గతేడాది ఏప్రిల్‌లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన అదిల్ హుస్సేన్ షాకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఉగ్రవాదుల నుంచి తుపాకీని లాక్కునేందుకు అదిల్ ప్రయత్నించారు. హార్స్ రైడర్ అయిన ఆయన.. ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను కాపాడేందుకు యత్నించారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం, లక్ష రూపాయల నగదుతో పాటు అవార్డును ఆయన కుటుంబానికి అందజేసింది.
- Advertisement -



