- Advertisement -
సన్మానం చేసిన గ్రామ ప్రజలు..
నవతెలంగాణ – జన్నారం
ఉర్దూ ఉపాధ్యాయురాలిగా విశేష సేవలందించిన తెలంగాణ ఉర్దూ అకాడమీ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని జన్నారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న రజియా బేగం కు అవార్డు అందుకున్నారు. సందర్భంగా శుక్రవారం రజియా బేగం ను జన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ప్రజాప్రతినిధులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల చైర్మన్ మహ్మద్ అజారుద్దీన్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్, మాజీ సర్పంచ్ నందు నాయక్ అజ్మత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -