Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గవర్నర్ చేత అవార్డు ప్రధానం..

గవర్నర్ చేత అవార్డు ప్రధానం..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని రాజ్ భవన్ లోని సంస్కృతి భవన్లో రక్తదాతల దినోత్సవం అవార్డ్స్ గవర్నర్ విష్ణు దేవా వర్మ చేతుల మీదుగా శనివారం ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్  మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 8 రక్త అనేది కేంద్రాలు పనిచేస్తున్నాయి దాంట్లో నిజాంబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు మరియు తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందిస్తున్నందుకు అభినందించారు.  రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలకు మోటివేటర్స్ కు , సంస్థలకు అవార్డ్స్ గవర్నర్ చేతులుగా గవర్నర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అత్యధిక సార్లు రక్తదానం చేసినటువంటి 67 సార్లు రక్తదానం చేసిన గాదేవార్ గంగాధర్ కు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందజేయడం జరిగింది. నిజాంబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలకు గాను రక్తదాన శిబిరాలు తలసీమియా అవగాహన సదస్సులు ప్రామాణికంగా నిర్వహిస్తున్నందుకు వరుసగా మూడోసారి ఐఎస్ఓ(ISO) సర్టిఫికెట్ గవర్నర్  చేతులమీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శి , ఇన్చార్జ్ చైర్మన్ దాన కిషోర్ ఐఏఎస్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవాని శంకర్,  జిల్లా చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కలిపే రవీందర్, ఈనాటి అవార్డు గ్రహీత గదేవర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad