Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన 

విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని జెడ్పిహెచ్ఎస్ ధర్మారావుపేట్ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు గురువారం యూఎస్ఏ కు చెందిన బ్రింగ్ బ్యాక్ ద బీట్ స్వచ్ఛంద సంస్థ తెలంగాణకు చెందిన హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కృష్ణకర్ రావు మాట్లాడుతూ.. వ్యక్తులు ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు లేదా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు లేదా కరెంటు షాక్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు గుండెను మళ్లీ పనిచేసేలా సిపిఆర్ చేయడం వలన వ్యక్తులు రక్షించబడతారని తెలిపారు. సుమారు 80 శాతం వ్యక్తులు సిపిఆర్ చేయకపోవడం వలన మరణానికి దగ్గరవుతున్నారని తెలిపారు. సిపిఆర్ పై అవగాహన పెంచుకోవడం వలన చనిపోయిన వ్యక్తులను మళ్లీ బ్రతికించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదే విధంగా తదనంతరం విద్యార్థులకు సిపిఆర్ పై ప్రాక్టికల్స్ నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యార్థి సిపిఆర్ ఎలా చేయాలో చేసి చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ దయానంద్ రాజు స్వామి శ్రీనివాస్ సుగుణ చిన్నయ్య విజయశ్రీ అన్వర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -