- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని తాడిచెర్ల సెక్షన్ పరిధిలోని మల్లారం బిట్ లో ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు శనివారం తాడిచెర్ల సెక్షన్ అధికారి గొడుగు లక్ష్మన్ అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులు నరికిన, అటవీ జంతువులకు హాని కలిగించేలా వేటాడిన, కరెంట్ వైర్లు, ఉచ్చులు బిగించిన శాఖాపరమైన చర్యలు ,జైలు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే అడవుల్లో ఉండే సహజ సంపదను తరలిస్తే చర్యలుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -