నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రం లోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం బాలికా, శిశు సాధికారత క్లబ్ ల పై వైద్య విభాగం నుండి సూపర్వైజర్పోలీస్ విభాగం నుండి మహిళా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దవూర ప్రధానోపాధ్యాయుల సమక్షంలో నిర్వహించారు. గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ సమావేశాలను ప్రతినెల విధిగా నిర్వహించి విద్యార్థుల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ నుండి సూపర్వైజర్ గుడ్ టచ్ బాడ్ టచ్ మరియు అడల్సన్స్ పేజీలో వచ్చే మార్పుల గురించి మరియు రక్తహీనత గురించి తెలియజేశారు.పోలీస్ విభాగం నుండి పోక్సో యాక్ట్ మరియు యాంటీ ర్యాగింగ్ మరియు ఆంటీ డ్రగ్స్ గురించి బాలికలకు తెలియజేశారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణ పాఠశాలలో విద్యార్థులు సక్రమంగా చదువుకొని పై చదువులకు వెళ్లాలని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తయారై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెలియాలని తెలియజేశారు.కార్యక్రమంలో రమాదేవి,చంద్రమణి,అలివేలు, చంద్రకళ, లలిత,మేరమ్మ,షాహిని, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
బాలికా, శిశు సాధికారత క్లబ్బులపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES