నవతెలంగాణ – భువనగిరి
కేంద్ర ప్రభుత్వ పీఎం స్వనిధి, జన సురక్ష పథకాలపై కెనరా బ్యాంకు ప్రధాన కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ సుబ్బారావు అవగాహన కల్పించారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీలో జిల్లా లేడి బ్యాంకు, మెప్మా ఆధ్వర్యంలో హార్దిక అక్షరాస్యత సురక్ష పథకాలు వీధి వ్యాపారులకు పునర్వ్యవస్థీకరించిన పిఎం స్వనిధి పథకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పి ఎం జె డి వై ఖాతాల రీ కేవైసీ, పిఎం జె జె బి వై, పి ఎం ఎస్ బి వై, ఏపీ వై పథకాలలో సభ్యత్వ నమోదు డిజిటల్ మోసాల నివారణ డిపాజిట్ల క్లైమ్ విధానం పునర్వ వ్యవస్థీకరించిన పిఎం స్వనిధి, పథకంలో నూతన మార్పులను సమగ్రంగా వివరించారు.
ఈ అవగాహన శిబిరం ద్వారా బ్యాంకింగ్ సేవలు, సామాజిక భద్రతా పథకాలు మరియు డిజిటల్ ఆర్థిక సదుపాయాల ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా చేర్చడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈకార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ బాబు, మెప్మా కోఆర్డినేటర్ శ్యామల, కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ శాంతి కుమార్, చీఫ్ మేనేజర్ మిథిన్ రాజ్, మహిళా సంఘాల సభ్యులు, వీధి వ్యాపారులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



