- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజు పోలింగ్ నిర్వహణపై పిఓలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ అశోక్ 89 మంది పిఓ లకు అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లో నిర్వహణ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ నిర్వహించే విధి విధానాలు పలు అంశాలపై మొదటి రోజు శిక్షణ నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించే నాటికి ఇంకో రెండు సార్లు అవగాహన ఉంటుందని ఎంపీడీవో లలిత కుమారి తెలిపారు. మొదటి విడతన ఈరోజు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
- Advertisement -