Saturday, September 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సీజనల్ వ్యాధులపై అవగాహన..

సీజనల్ వ్యాధులపై అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ అన్నారు. శనివారం మండలంలోని  తపాలాపూర్ గ్రామంలో సిద్ధి వినాయక గ్రామ సమైక్య మహిళా సంఘం మహిళలకు, గ్రామ ప్రజలకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత ,వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, రక్తహీనత మరియు దోమల వల్ల కలిగే మలేరియా డెంగ్యూ ఫైలేరియా వ్యాధులపై అవగాహన  కార్యక్రమం నిర్వహించారు..

సందర్భంగా వారు మాట్లాడుతూ  వర్షాకాలం కనుక దోమలు అధికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నందున  ఇళ్ల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగునీటి కుంటలు లేకుండా చూసుకోవాలన్నారు. ఆ మురుగునీటి కుంటలపై ఈగలు దోమలు వాలి మలేరియా డెంగు ఫైలేరియా  లాంటి ప్రాణాంతకారమైన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు కాచి పడపోసిన నీటినే త్రాగాలన్నారు.  జ్వరం, జలుబు ,దగ్గు ,ఒళ్ళు నొప్పులు లక్షణాలు కనబడితే మా ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిసి కొమురవెల్లి,వివో ఏలు దుంపల రమాదేవి శ్రీనివాస్ ఆశా కార్యకర్తలు లలిత ,విజయ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -