Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడి, పొడి చెత్తపై అవగాహన

తడి, పొడి చెత్తపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లిలో ఆదివారం ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా  తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మహబూబా అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు.

అనంతరం సర్పంచ్, ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్త పై అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఇంట్లోని చెత్తను బయట వేయకుండా చెత్త బుట్టల్లో తడి, పొడి చెత్త వేరువేరుగా నిల్వ ఉంచాలని సూచించారు. గ్రామంలోని దుకాణ సముదాయాలను సందర్శించి చెత్తను రోడ్లపై వేయొద్దని, రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు.గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా సర్పంచ్ మహబూబ్ కోరారు. ఈ కార్యక్రమంలో 

మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఉప సర్పంచ్ సట్ట విశాల్, పంచాయతీ కార్యదర్శి శివ, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -