- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బాల్యవివాహాల నివారణ చట్టం 2006 పై జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు సోమవారం విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు అనార్ధాలను వారికి వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదస్సులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ కృష్ణమూర్తి, కేసు వర్కర్ బాలకృష్ణ, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



