- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో గురువారం సాయంత్రం షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు పేర్కొన్నారు. షీ టీమ్ ఇంచార్జ్ అర్చన విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఇలా ఎదుర్కోవాలని అంశంపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆసియా ఫాతిమా, ఎస్సై కే చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుల్ సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -