Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్పోష్ ఆక్ట్ పై మహిళలకు అవగాహన..

పోష్ ఆక్ట్ పై మహిళలకు అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: పని ప్రదేశాలలో జరిగే లైంగిక వేధింపుల చట్టం( పోష్ ఆక్ట్) సార్పు సంస్థ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన  నిర్వహించారు. శుక్రవారం స్థానిక పెన్షనర్ భవనంలో సార్పు సంస్థ అధ్యక్షులు డాక్టర్ ప్రమీల ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై గ్రామాలలో పనిచేసే సిబ్బందికి వాలంటరీస్ కి శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ రిసోర్స్ పర్సన్ ఈశ్వర్ లక్ష్మి సోషల్ కన్సల్టెంట్ వారిచే ఏర్పాటు చేశారు. పని ప్రదేశంలో జరిగే లైంగిక  వేధింపుల చట్టం(పోష్ యాక్ట్)కోసం చెప్పడం జరిగింది. ఈ చట్టం నీ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి. పనిచేసే చోట కావాలని తాకినా.. ఆమె అందం గురించి మాట్లాడినా..  జీతం ఆశ ఎక్కువ చూపి లోబరుచుకోవాలని చూసినా.. ఇవన్నీ పని ప్రదేశంలో లైంగిక వేధింపుల క్రిందకు వస్తుందన్నారు. దీనికోసం పదిమంది మహిళలు పనిచేసే చోట కచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోక్సో చట్టం కోసం మాట్లాడుతూ.. ఇప్పుడు క్రొత్త అమెండ్మెంట్ ప్రకారం మగపిల్లాడికి ఆడపిల్లలకి 18 సంవత్సరాల లోపు వారికి అందరికీ వర్తిస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సార్పు సిబ్బంది సరిత, రాజేష్, కవిత, కృష్ణవేణి ,శోభ గ్రామస్థాయి వాలంటరీస్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -