Wednesday, March 4, 2026
E-PAPER
Homeకరీంనగర్అంతర్జాతీయ సమస్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు..

అంతర్జాతీయ సమస్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు..

- Advertisement -

జిల్లాస్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

అంతర్జాతీయ సమస్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సును మోడల్ స్కూల్ లో నిర్వహించారు. మండెపల్లి మోడల్ స్కూల్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నిర్వహించడం ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వివిధ సమస్యలపై ఎలా స్పందిస్తుందో తెలియజేస్తూ, విద్యార్థులను వివిధ దేశాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరింపజేస్తూ, అంతర్జాతీయ సమస్యలపై ఆయా దేశాల తరఫున మాట్లాడించారు.

అనంతరం విద్యార్థులకు అంతర్జాతీయ సమస్యలపై అవగాహన కల్పించారు. జిల్లాస్థాయిలో ఎంపిక కాబడిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మార్చి నెలలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ శైలజ,పాఠశాల ప్రిన్సిపాల్ మామిల్ల విఠల్,జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ రమేష్, శ్రీకాంత్ నిర్వాహకులుగా వ్యవహరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -