- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో సఖి ఆద్వర్యంలో శుక్రవారం అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫేస్ బుక్, సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. అత్యవసరంలో బాలికలు 181హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలన్నారు. అదే విధంగా సైబర్ నేరాలు, బాలకార్మిక నిరోధకచట్టాలు, మహిళ సంరక్షణ చట్టాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో సఖినిర్వాహకులు కవిత, సౌమ్య, బాను ప్రియా , సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -