- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎస్పీ బి.రోహిత్ రాజు ఆదేశాల మేరకు ” చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి అవగాహన కల్పించేందుకు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. సోమవారం మండలంలోని ఊట్లపల్లి లో మత్తు పదార్ధాలు,ఆరోగ్యానికి హాని కలిగించే మాదక ద్రవ్యాలు అనర్ధాలు పై అవగాహన కల్పించి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయవలసిందిగా యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు,సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



