- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ రైతు వేదిక భవనంలో సోమవారం ఉప్లూర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఉద్యానవన శాఖ అధికారులు రైతు సోదరులకు ఆయిల్ పామ్ పంట సాగు, పంటకు ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలు రైతులకు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ అధికారితో పాటు ఆయిల్ ఫామ్ కంపెనీ అధికారి సదస్సుకు హాజరవుతున్నారని పంట సాగులో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -