Tuesday, February 17, 2026
E-PAPER
Homeజిల్లాలుజేఈఈ ఫలితాలలో జాగృతి ప్రభంజనం

జేఈఈ ఫలితాలలో జాగృతి ప్రభంజనం

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి 
సోమవారం విడుదలైన జేఈఈ సీజన్ వన్ 2026 ఫలితాలలో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన జాగృతి కళాశాల విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. 100 శాతానికి గాను సిహెచ్ అర్జున్ అనే విద్యార్థి 91.69 పర్సెంటేజీని సాధించాడని కళాశాల యాజమాన్యం పేర్కొంది. అలాగే మరో విద్యార్థి గణేష్ 90.12 శాతం, జయంతి 29.96 శాతం, శ్రీలేఖ 82.62 శాతం, సాయి శివాని 80.92 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభను కనబరిచి తమ సత్తా చాటారని సంతోషం వ్యక్తం చేసింది. జేఈఈ 2026 లో 27 మంది విద్యార్థులు అన్ని కేటగిరీల్లో కలిపి 16 మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్ కు అర్హత సాధించారని పేర్కొంది.

రాష్ట్రస్థాయిలో మంచి పర్సంటేజీని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్, యాజమాన్య సభ్యులు శ్యామ్ కుమార్, సత్యనారాయణ, భాస్కర్ అధ్యాపక, అధ్యాపకేతర సభ్యులు విద్యార్థులను పూల బొకేలు శాలువాలతో ఘనంగా మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎటువంటి లాంగ్ టర్న్ కోచింగ్ లేకుండా రెగ్యులర్ ఇంటర్ విద్యతోపాటు జేఈఈ నీట్ ఎంసెట్ బ్యాచ్ లను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సాధారణ విద్యార్థులతో రాష్ట్ర జాతీయస్థాయి ర్యాంకులను సాధిస్తూ ఉమ్మడి జిల్లాలో సంచలనాలు సృష్టిస్తున్న ఏకైక కళాశాల జాగృతి అని ఆయన పేర్కొన్నారు.

ఈ స్థాయి మార్కులను సాధించిన విద్యార్థులకు సహకరించిన అధ్యాపకులకు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య సభ్యులు ఆధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -