Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ నియంత్రణ పై అవగాహన సమావేశం

ప్లాస్టిక్ నియంత్రణ పై అవగాహన సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో మండల కేంద్రంలో వివిధ షాపులు నిర్వహించే యజమానులకు ప్లాస్టిక్ నివారణ గురించి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు, ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలపై పంచాయతీ కార్యదర్శి గంగాజమున షాపుల యజమానులకు వివరించారు. దుకాణాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించని షాపుల యజమానులకు గ్రామ పంచాయతీ ద్వారా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా నిలిపేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ హారిక అశోక్ కోరారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వార్డు సభ్యులు, దుకాణాల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -