Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా శక్తి సంబరాలపై అవగాహన సమావేశం..

మహిళా శక్తి సంబరాలపై అవగాహన సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : “మహిళా శక్తి సంబరాలు” లో భాగంగా  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లు, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు తో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు  భాస్కర్ రావు  అవగాహన సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ సంబరాల్లో భాగంగా జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో మహిళా సంఘాల సమావేశాలు, కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమగ్రతతో ప్రజలలో అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులను తక్షణమే గుర్తించి, అవసరమైన బ్యాంక్ లోన్లు, శ్రీనిధి , సిఐఎఫ్  నిధుల ద్వారా ఆర్థిక సహాయం కల్పించి, గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశము లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి , మున్సిపల్ కమీషనర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -