Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిషేధిత మాంజను అమ్మొద్దని అవగాహన

నిషేధిత మాంజను అమ్మొద్దని అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో నిషేధిత మాంజను అమ్మొద్దని సూచిస్తూ గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ఉన్న అన్ని షాపులను సందర్శించి యజమానులకు నిషేధిత మాంజ వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను వివరించారు. నిషేధిత మాంజా మూలంగా ఎంతోమంది చిన్నారులు, పెద్దలు గాయాల పాలవుతున్నారని షాపుల యజమానులకు తెలియజేశారు. గ్రామంలో ఎవరు కూడా నిషేధిత మాంజా ధారాలను అమ్మొద్దని స్పష్టం చేశారు. షాపుల్లో విక్రయిస్తున్న పతంగి ధారాలను పరిశీలించారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుందేటి శ్రీనివాస్, వార్డు సభ్యుడు జుంబరాత్ అశోక్, దాస రాజేశ్వర్, కట్ట నారాయణ, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -