Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ శైలేందర్ గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలో యువకులు గంజాయికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఎవరైనా మదకద్రవ్యాలు వినియోగించిన, గంజాయి అమ్మిన, గంజాయి తాగిన పోలీసులకు సమాచారం అందించాలని సుచించారు.గుర్తుతెలియని వ్యక్తులు ఫోను చేసి మీ సమాచారం సేకరిస్తారని వాటి ద్వారా మీ అకౌంట్ నుండి డబ్బులు మాయం చేస్తారని హెచ్చరించారు.

ఫోన్లో మెసేజ్ ల ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు.యువకులు స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల అందులో కొత్తగా వచ్చే యాప్స్ ద్వారా సైబర్ నేరాలకు బలి అవుతున్నారని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ఉపయోగించాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వాసుదేవ్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -