- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ :కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ క్రైమ్,100 డయల్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి పాల్గొని సైబర్ నేరాల వల్ల జరిగే నష్టాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏ సమస్య ఎదురైనా వెంటనే 100 డయల్ కు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడి నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని, చదువును ఇష్టంగా చదువుకోవాలని, చదువుతోపాటు ఆటల్లో రాణించాలని, సీఐ నాగార్జున విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మాధవరెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



