- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలోని చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాన్ని సోమవారం నిర్మల్ పంచశీల్ టిటిసి కళాశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిఓ అజీజ్ ఖాన్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిర్మూలన,తోపాటు చెత్త నుండి సేంద్రియ ఎరువుల తయారీ చేయడంతో సంపద ఎలా సృష్టి ఛలో విద్యార్ధులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంతారావు,స్వచ్ భారత్ మిషన్ జిల్లా అధికారి మధుమిత,గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, ఉప సర్పంచ్ ఐర కృష్ణారెడ్డి క్లస్టర్ పంచాయతీ కార్యదర్శులు కృష్ణ, గోపికృష్ణ, రజిత రాజమోహన్ వివిధ గ్రామాల సిబ్బంది పంచశీల్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు .
- Advertisement -



