నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పైన ప్రతి ఒక్కరు ఎంతో కొంత నష్టాల పాలవుతూ భారీ మొత్తము ఆర్థిక నష్టం జరిగిన సందర్భాలు మనం నిత్యం వింటూనే ఉంటున్నాము. కావున ఫోన్ల వాడకం తగ్గించాలని అన్నారు. ఫోన్ కు వచ్చే మెసేజ్ ల వివరాలు, పిన్ నంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు, ఎవరికీ చెప్పొద్దని అన్నారు. వీటిద్వారా ఖాతా నుండి డబ్బులు కొల్లగొట్టే అవకాశం ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను రిసీవ్ చేయవద్దని అన్నారు. అదేవిధంగా కొత్తకొత్త యాపులు సృష్టించి వాటి ద్వారా ఒక సమాచారాన్ని ఇచ్చి దానికి టచ్ చేయండి అని చెప్పి, మన సమాచారాన్ని పూర్తిగా చోరీ చేయడం జరుగుతుంది తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలొ నివసించే ప్రజలకు, ముఖ్యంగా వారికి తమ విద్యనభ్యసిస్తున్న పిల్లల తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనర్ధాలు జరుగుతాయని, వాటిని దూరం పెట్టాలని , వాటిని అలవాటు చేసుకోరాదని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా కళాశాల విద్యార్థులకు ఎస్సై నవీన్ చంద్ర అవగాహన పరచడం జరిగింది.



